ఖాజీపేటలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఓ మద్యం దుకాణాన్ని తరలించాలంటూ స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. మైదుకూరు రోడ్డులో ఉన్న మద్యం దుకాణం కారణంగా ఇబ్బంది కలుగుతోందంటూ గతంలో స్థానికులు అధికారులకు విన్నవించారు. ఇప్పుడు తాజాగా కొత్త మద్యం దుకాణాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయడంపై ప్రజలు మంగళవారం తహసీల్దారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం సేవించే వారితో విద్యార్థులు, మహిళలకు ఇబ్బంది కలుగుతుందన్నారు.