పొరుమామిళ్ళ రోడ్డులోని కూరగాయల మార్కెట్ ను మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి సోమవారం సందర్శించారు. కూరగాయల మార్కెట్లోని సమస్యల గురించి అక్కడ వ్యాపారం నిర్వహిస్తున్న వారితో మాట్లాడారు. పలు సమస్యలను వ్యాపారస్థుల దృష్టికి తీసుకెళ్లారు. కూరగాయల ధరలు అందరికీ అనుకూలంగా ఉండేలా చూడాలని కోరారు. మార్కెట్లో ఉన్న సమస్యలను ఆయన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.