విజయవాడ వరద బాధితుల కోసం విరాళం అందించినట్లు గురువారం బద్వేల్ టీడీపీ ఇన్ చార్జ్ రితేశ్వర్ రెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేశ్ కు రూ. 10 లక్షల చెక్కును అందించినట్లు వెల్లడించారు. విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయం ప్రాంగణంలో లోకేశ్ ను కలిసినట్లు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.