వాహనాలను రహదారిపై నిలిపి ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు. తమ సిబ్బందితో కలిసి సోమవారం వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేసి అనుమతి పత్రాలు లేని వాటిని గుర్తించి ఫైన్ వేశారు. ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని వాహన చోదకులకు సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని వాహనదారులకు తెలిపారు.