బుధవారం ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో మినీ గోకులాల పథకం గురించి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉంగుటూరు ఎండిఓ జి ఆర్. మనోజ్ మాట్లాడుతూ, మండలానికి మొదటి విడతగా 65 మినీ గోకులాలు మంజూరు చేయడమైంది. వీటికి సంబంధించిన షెడ్ల నిర్మాణానికి రూ.2.30 లక్షలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. గోకుల పథకాలకు ఎంపికైన లబ్దిదారులకు నిర్మాణ విధానాలు, పూర్తి చేయాల్సిన గడువులు వంటి విషయాలపై అవగాహన కల్పించారు.