రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

14832பார்த்தது
రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
బైక్ నడుపుతూ అదుపు కోల్పోయి యాక్సిడెంట్ కి గురైన యువకుడు చికిత్స పొందుతూ మరణించిన సంఘటన శనివారం జరిగింది. భీమడోలు అర్జావారిగూడెం నకు చెందిన విజయ్ ప్రకాష్ ఇంటర్ వరకు చదువుకొని పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. ప్రతికొల్లలంక లో పని చేస్తూ అక్కడ ఉంటున్న విజయ్ ప్రకాష్ గత డిసెంబర్ 31 రాత్రి స్నేహితుడ్ని దిగబెట్టడానికి మేస్త్రి కి చెందిన మోటార్ సైకిల్ వేసుకొని గుండుగొలను వచ్చాడు.

తిరిగి వెళ్తుండగా భోగాపురం శివారుకు వచ్చే సరికి బైక్ ముందు చక్రం పంక్చర్ గురైన సంగతి గుర్తించక వేగంగా నడుపుతుండటం వల్ల బైక్ పై అదుపు కోల్పోయి కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విజయ్ ప్రకాష్ ని స్థానికులు 108 ఆంబులెన్స్ ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ లోని ఒక ప్రవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్న విజయ్ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி