పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధికి మంత్రి తోడ్పాటు అందిస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జిల్లా అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తారని అన్నారు.