పోలవరం నియోజకవర్గంలో రూ. 2, 000 కోట్లతో నౌకాదళ ఆయుధగారం ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ. నేవీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతుందని త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఈ ప్రాంత ప్రజలు సహకరించాలని ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.