అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటు నమోదుకు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని నరసాపురం తహసీల్దార్ రాజరాజేశ్వరి బుధవారం తెలిపారు. ఆక్టోబర్ 2021 నాటికి పట్టభద్రులైన వారంతా అర్హులన్నారు. ఆన్లైన్లో ఓటు నమోదుకు ఫారం-18తో పాటు అటెస్టేషన్ చేయించిన డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు నకలు, ఓటరు కార్డు నకలు, ఫొటోను నిర్దేశిత కేంద్రాల్లో అందజేయాలన్నారు.