పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం పురపాలక సంఘం చైర్ పర్సన్ బర్రె వెంకటరమణ జయరాజు బుధవారం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 25వ వార్డు కంభాల వారి వీధిలో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్న నీటిని వెంటనే మోర్టర్లు ఏర్పాటు చేసి డి- వాటరింగ్ చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా బ్లిచింగ్, ఆయిల్ బాల్స్ వేయాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు.