నరసాపురం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శుక్రవారం పారిశుధ్య కార్మికులతో సమావేశమైయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడలో వచ్చిన వరద విపత్తు సమయంలో నరసాపురం మున్సిపాలిటీ నుంచి 40 మంది పారిశుధ్య కార్మికులు, సిబ్బంది విపత్తు నిర్వహణలో పాల్గొన్నారు. వారిని ఈ సందర్బంగా ఆయన కార్మికులను అభినందించి వారికీ బట్టలు అందజేశారు.