ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారిగా వి. విశ్వేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీఆర్వోకు అభినందనలు తెలిపారు. ఈయన గతంలో ఒంగోలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ ఛైర్మనుగా పని చేసిన విశ్వేశ్వరరావు ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమితులయ్యారు.