ఏలూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట ఓ రోగి బంధువులు శనివారం రాత్రి బైటాయించారు. ఆసుపత్రిలో వైద్యులు చేసిన ఆపరేషన్ వికటించి జబ్బు నయం కాకపోగా మరింత ముదిరిందని బాధిత బంధువులు ఆందోళన చేపట్టారు. గత 3 గంటలుగా ఆసుపత్రి ఎదుట రోడ్డుపై చిన్నారులతో బైటాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.