సురక్షిత ప్రయాణానికి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని లేనిపక్షంలో శిక్షార్హులవుతారని కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరించారు. శుక్రవారం ఏలూరులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, రోడ్డు భద్రతా చర్యలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు.