కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి, కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమేవేశపు హాలులో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలును అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పేద ప్రజలు, రైతుల సంక్షేమానికి, గ్రామాలలో మౌలిక సదుపాయాలకు ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.