ఏలూరు పార్లమెంట్ పరిధిలో నేషనల్ హైవేలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ కు ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం దిల్లీ కార్యాలయంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ కలిసి నాలుగు సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అందజేశారు.