ఏలూరు జిల్లాలో పోలీస్ శాఖలో పనిచేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలతో ఏలూరు పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, వాటి స్థితి పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు.