ఏలూరు వన్‌టౌన్ పరిధిలోని సత్యనారాయణపేటలో ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ తగిలి యు
వకుడు మృతి చెందాడు. బుధవారం నిర్మాణంలో ఉన్న భవనంపై సిమెంట్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో రాఘవ అనే తాపీ మేస్త్రి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.