ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలనీ ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏలూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అలాగే మొత్తం 238 అర్జీలు స్వీకరించడం జరిగిందని అన్నారు.