ఏలూరు జిల్లాలోని విద్యార్థులందరికీ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ గుర్తింపు నంబర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కోన శశిధర్ కి చెప్పారు. 'అపార్' ఐడిలు జారీ, మెగా డిఎస్సిలో పోస్టుల వారీగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల ఖరారు, ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ తదితర అంశాలపై ఆయనతో చర్చించారు.