భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ శనివారం ఉంగుటూరు మండలం చేబ్రోలులో పర్యటిస్తారని శుక్రవారం ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతీరాణి తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై లబ్ధిదారులతో మాట్లాడతారన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, కైకలూరు ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, కామినేని శ్రీనివాసరావు తదితరులు హాజరవుతాన్నారు.