ఏలూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.