చింతలపూడి మండలం నామవరంలో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో బోడా రామారావు అనే వ్యక్తి ఇంటి సమీపంలో నాటు సారా తయారు చేస్తుండగా అతనిని అదుపులోకి తీసుకుని 90 లీటర్లు నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీ కోసం బెల్లం సరఫరా చేసిన మారేశ్వరరావు కోసం విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.