ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించుకుందామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సమీక్ష సమావేశంలో బుధవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. మీ కోసం పని చేసే ప్రతినిధికి అండగా మనందరం నిలవాలని, గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు.