ముఖ్యమంత్రి సహాయనిధి నుండి, వైద్య ఖర్చులు రద్దు చేసిన జగన్ కు పేద మధ్యతరగతి వర్గాల గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం పాలకొల్లు మంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి నిమ్మల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ జగన్, అంతర్జాతీయ నేరగాడిగా అపఖ్యాతి పొందాడని విమర్శించారు.