AP: 'జన నాయకుడు' పోర్టల్ ద్వారా ప్రజాసమస్యలు పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం కుప్పంలో 'జననాయకుడు' పోర్టల్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. "తెలుగుదేశం పార్టీ చేసే సాయం ఒక వైపు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే సాయం ఒక వైపు, వ్యక్తిగతంగా నాయకులు చేసే సాయం ఒక వైపు. ఇవన్నీ టెక్నాలజీ ద్వారా క్రోడీకరించుకుని "జన నాయకుడు" పోర్టల్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాం." అని తెలిపారు.