జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా శనివారం యలమంచిలి పట్టణంలో పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు కలసి యలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసీల్ధార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా, ఏపీ యూ డబ్ల్యూ జే కార్యదర్శి గంగాధర్, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకర్లు ఐకమత్యంతో ఉండి, ప్రభుత్వ నుంచి తమ హక్కులను సాధించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విలేకర్లు పాల్గొన్నారు.