ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని, ఉచిత ఇసుక హామీని నెరవేర్చాలని సిపిఎం జిల్లా నాయకులు రాము, శివాజీ, అప్పారావు శనివారం యలమంచిలి పాత జాతీయ రహదారిపై నిరసన ధర్నా నిర్వహించారు. వారు మెమో 1214 రద్దు చేసి సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలని, భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. అనంతరం ఎలక్షన్ డిటి కే వాలేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు.