అచ్యుతాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం ఎలమంచిలిలోఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు చేస్తున్న దీక్షకు మద్దతుగా తను ఈ దీక్షను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దీక్ష పూర్తిగా వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.