స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అచ్చుతాపురం ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో, విద్యుత్ ఉపకేంద్రం కార్యలయం వద్ద గురువారం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మాతృభూమి కోసం తమ ధన మన ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావులు ఎందరో పోరాట స్ఫూర్తి త్యాగఫలమే మన స్వాతంత్ర దినోత్సవానికి కారణమని వారి యొక్క గొప్పతనాలు కొనియాడారు.