విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు జీవీఎంసీ కో - ఆప్షన్ మెంబర్ బెహరా భాస్కరరావు ఆధ్వర్యంలో గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.