పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ 52వ వార్డు పాత కరాసలో నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ సారధ్యంలో సుమారు 1.50 లక్షల రుపాయల వ్యయంతో మంజూరు కాబడి నిర్మాణ దశలో ఉన్న సిసి రోడ్లను విశాఖ నగర డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ సోమవారం పర్యవేక్షించారు. మిచాంగ్ తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే మిగిలి ఉన్న అన్ని కాలనీల రోడ్డు పనులను తిరిగి ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.