పశ్చిమ నియోజకవర్గం 92వ వార్డు పద్మనాభ నగర్ లో జీవీఎంసీ కో ఆప్షన్ మెంబర్ బెహరా భాస్కరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కాపు కళ్యాణ మండపం పనులను ఆదివారం పరిశీలించారు. కళ్యాణ మండపానికి సంబంధించి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందించాలని, నాణ్యత విషయంలో దగ్గరుండి చూసుకొని పనులు చేయించుకోవలసిన బాధ్యత మీదేనని కాపు సంఘం నాయకులకు సూచించారు.