విశాఖలో బార్ అండ్ రెస్టారెంట్లు తప్ప మిగిలిన అన్ని హోటల్స్, రెస్టారెంట్లు , ఇతర తినుబండారాల దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకూ నిర్వహించుకోవచ్చనిపోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యాటక ప్రాంతంగా విశాఖ భాసిల్లుతున్న నేపథ్యంలో అర్ధరాత్రి 12 గంటల వరకు ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనిని అందరూ సద్వనియోగంచేసుకోవాలనికోరారు.