పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సుజాతనగర్ జనసేన కార్యాలయం వద్ద బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలో ప్రజలనుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.