కోటవురట్ల సమీపంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు కాకర కొండబాబు (50) మృతి చెందాడు. కోటవురట్ల శివారు రాట్నాలపాలెం గ్రామానికి చెందిన కొండబాబు పొలానికి వెళ్లి యూరియా జల్లుతుండగా పడిన పిడుగుకు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నట్లు ఆయన సోదరుడు కుమార్ తెలిపారు. నిరుపేద అయిన కొండబాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని స్థానికులు కోరారు.