ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలి

55பார்த்தது
నర్సీపట్నం మండలం గబ్బాడ ఇసుక డిపోలో అందుబాటులో ఉన్న వేలాది టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నర్సీపట్నంలో మాట్లాడుతూ గత నెల 13వ తేదీన అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు దీనిపై వినతిపత్రం కూడా అందజేసామన్నారు. మరో వారం రోజులు పాటు చూసి కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி