విశాఖ ఉక్కు ఉద్యోగులు సంస్థ ప్రస్తుత పరిస్థితిని చూసి అక్కడ కొనసాగడానికి ఆసక్తి చూపడం లేదు. ఉత్పత్తి పడిపోవడం, ముడి పదార్థాలకు నిధుల కొరత, కేంద్రం సహాయం కోసం ఆచితూచి వ్యవహరించడం వంటి సమస్యల కారణంగా వారు ఆందోళన చెందుతున్నారు. కాగా , వీఆర్ఎస్ తీసుకోవడం మంచిది అని భావిస్తున్నారు. ఈ నెల 29 వరకు పేర్లు నమోదుకు అవకాశం ఉందని తెలుస్తోంది, మొదటి రోజులో 500 మంది, రెండో రోజులో 1,200 మంది వీఆర్ఎస్కు సమ్మతి తెలిపారు.