దేశవ్యాప్తంగా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జీవీఎంసీ 8 వవార్డు పరిధిలో గల పాత మధురవాడ మెట్టలో ఇంటి ఇంటికి పెరిగిన ధరలుపై కరపత్రాలు పంచే కార్యక్రమంలో పాల్గొని పైడిరాజు మాట్లాడుతూ సామాన్య జనం నోట్లోకి నాలుగువేళ్లూ పోవాలంటే గగనం అవుతున్నదని, ధరల భారం కోట్ల కుటుంబాలను పస్తులతో అలమటిస్తున్నారన్నారు.