రాష్ట్రంలోని మహిళలకు తెలుగుదేశం పార్టీ కాలకేయుల నుంచి రక్షణ కల్పించాలని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. విశాఖలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండాపోయిందని మండిపడ్డారు. పిఠాపురంలో దుర్గాట జాన్ అనే టీడీపీ నాయకుడు16 ఏళ్ల బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసే ఘోరమైనదుస్థితికి పాలన దిగజారిందని వరుదు కళ్యాణి ఆక్షేపించారు.