విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఆరిలోవ కాలనీ చివరి బస్స్టాపు వద్ద జివిఎంసి రక్షణ గోడను తొలగించి కొత్తగా నిర్మించిన షాపుల్లో మద్యం షాపు ఏర్పాటుకు జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. దీనికి వార్డు టిడిపి నాయకలు అండగా ఉంటూ, పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల జివిఎంసి రక్షణ గోడకు ఆనుకొని రెండు షాపులు నిర్మించారు. ప్రస్తుతం మద్యం షాపు కోసం ఇటువైపు షాపులు నిర్మించి, జివిఎంసి రక్షణ గోడను తొలగించేసారు.