వివాఖ: మద్యం షాపు వద్దంటూ ఐద్వా ఆందోళన

84பார்த்தது
వివాఖ: మద్యం షాపు వద్దంటూ ఐద్వా ఆందోళన
విశాఖ తూర్పు నియోజకవర్గంలోని 28వ వార్డు దసపల్ల హిల్స్ దరి పంది మెట్ట ప్రాంతంలో మద్యం దుఖాణం ఏర్పాటుపై మహిళలు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి నివాస గృహాల మధ్య ఏర్పాటు చేయడం తగదని ఐద్వా నాయకురాలు కె. మణి పేర్కొన్నారు. బడి-గుడికి సమీపంలో మద్యం షాపులు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని, అటువంటిది ముత్యాలమ్మ ఆలయానికి సమీపంలో షాపు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி