చోడవరం పంచాయతీ పరిధిలో గల ఫకీర్ సాహెబ్ పేట ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై అనకాపల్లి జిల్లా టాస్క్ ఫోర్స్ బృందo బుధవారం ఆకస్మిక పరిశీలన జరిపింది. ఇక్కడ ప్రజలకు అందుతున్న సేవలు చూసి సంతృప్తి చెందిన బృందం గర్భిణీలకు, కౌమర బాలికలకు రక్తహీనత కు సంభందించిన హెచ్ బి టెస్ట్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డ్స్, రిపోర్ట్స్ తనిఖీ చేశారు. పలు సూచనలు చేశారు