పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామంలో డీపీఎం లచ్చన్న ఆధ్వర్యంలో నవధాన్యాల సాగు - నేలతల్లి బాగు అనే నినాదాలతో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ , సచివాలయం సిబ్బంది , గ్రామ పెద్దలు రైతులు మహిళా సంఘాల సభ్యుల
సహకారంతో నవధాన్యాల సాగుపై అవగాహన కల్పించారు. డిపిఎం మాట్లాడుతూ.. నవధాన్యాలు వేసుకోవడం వలన అన్ని రకాల పోషకాలు లభించి భూసారం పెరుగుతుందని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ గోవిందు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.