విశాఖలో అన్ని రైతు బజార్లకు ఒకరోజు సెలవు కొనసాగించాలని అక్కయ్యపాలెం, నరసింహ నగర్ రైతు బజార్ రైతులు ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు విజ్ఞప్తి చేశారు. అన్ని రైతు బజార్లకు వారంలో ఒకరోజు సెలవు ఉండేది. జాయింట్ కలెక్టర్ దీనిని రద్దు చేశారు. దీనిపై మెజార్టీ రైతులు సెలవు కొనసాగించాలంటూ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు శనివారం వినతిపత్రం అందజేశారు.