ఎస్ కోట నియోజకవర్గంలో అధిక శాతం గ్రామాల్లో వైసీపీ సర్పంచులు అధికారంలో ఉన్నారని, గ్రామాలను అభివృద్ధి చేసుకునే బాధ్యత సర్పంచులదేనని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఎస్ కోట వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో వైసిపి అధికారం చేపట్టడం ఖాయమని, అందుకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.