మద్యం షాపుల్లో పనిచేసే సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లాలో గల ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ విధానం కారణంగా 15 వేల కుటుంబాలు వీధిన పడతాయని అన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బందికి వేరొక శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. తక్షణమే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.