మెంటాడ మండలం గుర్ల గ్రామం పొలిమేరలో ఈ నెల 11వ తేదీన మోటార్ సైకిల్ పై 25 లీటర్ల నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న కేసులో బుధవారం ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆండ్ర సబ్ ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపారు. అతను పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. అక్రమ సారా తరలింపులో పట్టుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు మత్తు పదార్థాల తరలింపు పై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.