మన్యం జిల్లాలో రక్తహీనతతో ఉండే గర్భిణీలపై, హై రిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టరు ఎ. శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో ఎటువంటి మాతా, శిశు మరణాలు జరగరాదని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైన వైద్యాన్ని, మందులను అందించాలని చెప్పారు.