రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలోనే మద్యం షాపులకు అత్యధిక దరఖాస్తులు వచ్చాయని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ పి రామచంద్రరావు అన్నారు. భోగాపురం ఎక్సైజ్ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో 205 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించామని తెలిపారు.